Loading...
H.No. 9-5-50/2 Kasba Bazar, Station Road, near to ifb point, Khammam,Khammam(Dist), Telangana 507001 -Trust is 80G certified
8341706507

Spoorthi Daathalu

శ్రీగురు పాదుకా పీఠం ట్రస్ట్ ద్వారా జరిగే అన్ని సేవలలో నిత్యం పాల్గొని తమ వంతుగా వయసు తో నిమిత్తం లేకుండా తమ భారాన్ని స్వామికి సమర్పించి స్వామివారికి శరణాగతి అయ్యి స్వామి వారి సేవలో జీవితం గడుపుతున్న వారే శ్రీ జయంతి కోటాచారి మరియు సుగుణ దంపతులు... వీరు దత్త పీఠం లో సేవలు అందించటమే కాకుండా ప్రతి రోజూ స్వామివారి స్మరణ చేస్తూ స్వామి వారి శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం కూడా ఇప్పటికీ షుమారు 111 సార్లు పారాయణ చేసిన ఘనత గావించారు..స్వామి వారి పుణ్య క్షేత్రము పిఠాపురం కూడా వెళ్లి ఎన్నో రోజులు స్వామి వారి దర్శనం చేసుకుని స్వామి వారి సేవలో గడిపిన పుణ్య దంపతులు వారు...వారి ఇంట నిత్యం అన్నపూర్ణ దేవి కొలువై ఉంటారు ఎన్నో ఏళ్లుగా వారు తమకు ఉన్న దానిలోనే తమకు చేతనైనంత గా అందరికీ సహాయం చేస్తూ స్వామి వారి మార్గం లో వారి జీవితం గడుపుతున్నారు ..వీరు మాత్రమే కాకుండా వీరి ద్వారా ఎంతో మంది నీ కూడా స్వామి వారి సేవకు పాత్రులు అయ్యేలాగా ప్రేరేపిస్తుంటారు...ట్రస్ట్ ద్వారా జరిగే అన్నదానం కార్యక్రమం లో కూడా వీరు ప్రతి ఆదివారం మరియు ప్రత్యేక రోజులలో జరిగే అన్నదానం కార్యక్రమం లో వీరి సేవలు శ్రమ రూపంలో మరియు ధన రూపంలో కూడా అందిస్తుంటారు. ప్రతి పౌర్ణమికి జరిగే ఉచిత సామూహిక శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘస్వామి వారి శ్రీ అనఘాష్టమి వ్రతాలలో కూడా వీరి సేవలు వీరి ప్రోత్సాహం అమోఘం...ఇంకా కోటాచారి గారు కూడా జ్యోతిష్య శాస్త్రం లో దిట్ట గా ఉంటారు..వారికి అన్ని రకాల జ్ణానం సరస్వతి మాత కృప వలన లభించింది...వీరికి జ్యోతిష్య శాస్త్రం లో చేసిన సేవకు ఎన్నెన్నో బహుమతులు పురస్కారాలు సన్మానాలు అందినవి ...వీరికి దైవ భక్తి ఎక్కువ ఉన్న కారణం గా స్వామి తన యొక్క ఎన్నో రూపాలను వీరి చేత చెక్కించుకున్నారు..వీరు చాలా దేవీ దేవతల అవతారాలను స్వయంగా తయారు చేసి రంగులు అద్ది అలంకరణ గావించి అందంగా ఇంటిలో స్వామి అలరారేలా చూసుకుని మురిసిపోతూ ఉంటారు....వీరికి సరస్వతి మాత అనుగ్రహం మెండుగా ఉందని అనటానికి మరొక ఉదాహరణ ఏమిటంటే వారి వయసుకు అతీతంగా తన 54 వ ఏట సంస్కృత భాషలో తన స్నాతకోత్తరం పూర్తి చేసి ఎన్నెన్నో సంస్కృత గ్రంథాలను, తాళ పత్ర గ్రంథాలను తెలుగు భాష లోనికి అనువదించిన నిదర్శనం మనకు కనిపిస్తుంది...ఇలా ఈ పుణ్య దంపతులు ఒకరిని మించి మరొకరు గా దైవ నామ స్మరణ లో స్వామి వారి సేవలో వారి జీవితాన్ని అంకితం చేస్తున్నాను ..ఇలాగే వారి జీవితాలు భవిష్యత్తులో కూడా స్వామి వారి కోసమే ఉండాలని మనం కూడా స్వామి వారిని కోరుకుందాం..

ఇట్లు

శ్రీ గురుపాదుకా పీఠం ట్రస్ట్ చైర్మన్

శ్రీ ఉరిమెళ్ల కృష్ణ ప్రసాద్

కస్పా బజార్, ఖమ్మం.

admin/mahadaatalu_images/